యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన యాక్టింగ్ స్కూల్ యజమాని అరెస్ట్
- April 23, 2019లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సూత్రధార యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో అతన్ని హాజరుపరిచారు. నిందితుడు వినయ్ వర్మ మీద సెక్షన్ 354 ఏ, 506, 509 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉండే సూత్రధార యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కు వినయ్‌వర్మ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నాడు. బాధితురాలితో పాటు ఎనిమిది మంది నటశిక్షణ తీసుకునేందుకు అందులో చేరారు. ఈ నేపథ్యంలో నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలంటూ 9 మంది యువతులతో అసభ్య ప్రవర్తించాడు వినయ్ వర్మ. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నారాయణ గూడ పోలీసులు.. వినయ్ వర్మను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి