టిక్ టాక్ అభిమానులకు గుడ్ న్యూస్..
- April 24, 2019చైనీస్ యాప్ టిక్ టాక్ అతి తక్కువ కాలంలోనే నెటిజన్స్ మనసు దోచుకుంది. టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ.. హల్చల్ చేశాయి. దీంతో ఈ
యాప్ పాపులారిటీ సంపాదించింది. అయితే ఆశ్లీలత, విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు ఉన్నాయన్న కారణంగా మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 3న భారత్‌లో టిక్ టాక్ యాప్
డౌన్‌లోడ్‌ను బ్యాన్ చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.
కోర్టు ఆదేశాలపై టిక్ టాక్ రూపకర్త బైటెడెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు
వైఖరేంటో ఏప్రిల్ 24వ తేదీలోగా స్పష్టం చేయాలని సూచించింది. అప్పటికి హైకోర్టు నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే ఆ న్యాయస్థానం ఇచ్చిన నిషేధ ఆదేశాలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేస్తు మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు