దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?

- May 19, 2024 , by Maagulf
దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?

దుబాయ్: దుబాయ్  విలాసవంతమైన షాపింగ్ మాల్స్‌కు ప్రసిద్ధి. ఇక్కడ దుబాయ్ ఫ్లీ మార్కెట్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. 2007లో ఏర్పాటైన ఇది వ్యక్తులు తమ ఇళ్లను క్లియర్ చేసి ఉపయోగించిన లేదా అనవసరమైన బట్టలు, గృహోపకరణాలు, బొమ్మలు, పుస్తకాలు మరియు ఎలక్ట్రికల్ వస్తువులను విక్రయించడానికి తరలివస్తారు.  జబీల్ పార్క్, డిస్కవరీ గార్డెన్స్, అల్ బార్షా మరియు సిలికాన్ ఒయాసిస్ నార్త్ పార్క్‌తో సహా వివిధ ప్రదేశాలలో నెలకు అనేక సార్లు నిర్వహిస్తారు. 16 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇది జబీల్ పార్క్ మార్కెట్ లో 250 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గరిష్టంగా 500 స్టాల్స్ మరియు 15,000 మంది కొనుగోలుదారులు సందర్శించారని దుబాయ్ ఫ్లీ మార్కెట్ వ్యవస్థాపకురాలు మెలానీ వివరించారు.   

జబీల్ పార్క్ మార్కెట్ ఏడాది పొడవునా నడుస్తుంది. వేసవిలో నెలలో మొదటి శనివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మరియు చలికాలంలో నెలలో మొదటి ఆదివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. ఇతర ఫ్లీ మార్కెట్ల సమయాలు మారుతూ ఉంటాయి. స్టాండ్‌ల ధర Dh290 మరియు వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌లు చేయవచ్చు. ప్రతి స్టాల్‌లో కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండేందుకు అవకాశం ఉంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com