'NGK' మూవీ ట్రైలర్ విడుదల
- April 29, 2019హైదరాబాద్: సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఎన్జీకే'. ఈ సినిమాలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ సాయంత్రం విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఒక చిన్న గుంపును వేసుకొని రాజకీయాల్లోకి వచ్చేస్తే.. నిన్ను రానిస్తారు అనుకున్నావా? అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. డ్రీవ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను మే 31 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సూర్య నటిస్తోన్న మరో చిత్రం 'కాప్పాన్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాప్పాన్ సినిమా ఆగస్టులో ప్రేక్షక్షుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్