యూఏఈలో అంగరంగ వైభవంగా జరిగిన రుద్రాభిషేకం మరియు శివ పార్వతుల కల్యాణ మహోత్సవం

- April 29, 2019 , by Maagulf
యూఏఈలో అంగరంగ వైభవంగా జరిగిన రుద్రాభిషేకం మరియు శివ పార్వతుల కల్యాణ మహోత్సవం

అజ్మన్:అయిదవ వార్షికోత్సవ మహాన్యాస పూర్వక లఘు రుద్రాభిషేకం, శివ పార్వతుల కల్యాణ మహోత్సవం,శుక్రవారం, 26 ఏప్రిల్ 2019 న ఇండియన్ అసోసియేషన్ హాల్, అజ్మన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కన్నుల పండుగ గ జరిగినది.దేశ వ్యాప్తంగా  వచ్చిన 2500 మంది భక్తులు రోజంతా ఆధ్యాత్మికతలో తాదాత్మ్యం చెంది మంత్ర ముగ్దులైనారు. భారతదేశ ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల నుండి సాంప్రదాయిక వస్త్రధారణలో పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఈ కార్యక్రమానికి హాజరయి శివ మరియు మాతా పార్వతి యొక్క వివాహ వేడుకను చూశారు.ఈ సంవత్సరం నుంచి మంగళ గౌరి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ పండితుడు మరియు ఆధ్యాత్మిక బోధకుడు డాక్టర్.కాకునూరి సూర్యనారాయణ మూర్తి  వేద పండితుల మరియు పూజారుల బృందాన్ని కార్యక్రమ ఆసాంతం సమన్వయ పరిచారు. 

ముప్పది మందికి పైగా ప్రదోషం బృంద సభ్యులు రుద్రంను పఠించి కార్యక్రమానికి దైవత్వాన్ని ఆపాదించారు. డాక్టర్.సూర్యనారాయణమూర్తి భారతీయ సంస్కృతి,  సాంప్రదాయ విలువలను మరియు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు. హిందూ వివాహ ఆచారాల గురించి వివరించి వచ్చిన భక్తుల సందేహాలను తీర్చారు. 

మన సంస్కృతి  సంప్రదాయాలను, ఆధ్యాత్మిక ను యూఏఈ లో ని తరువాతి తరాలకు అందచేయాలని అంతే కాక ప్రపంచ శాంతి మరియు సౌభాగ్యాలకోసం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీకరం బృంద వ్యవస్థాపక సభ్యుడు రవి కొమర్రాజు చెప్పారు. బృంద సభ్యులైన రవి తిప్పరాజు, ప్రసాద్ రావు, రామరావు,వంశీ,గంగ రెడ్డి,శశిధర్ రెడ్డి,ఆదిత్య తదితరులు కార్యక్రమం విజయవంతమైనందుకు తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. 

శ్రీమతి.శోభా నాయుడి శిష్యురాలైన శ్రీమతి.ప్రీతి తాతమ్ భొట్ల  నృత్య ప్రదర్శన, అలానే వారి విద్యార్థులు ప్రదర్శించిన బృంద నాట్యం సభికులను ఆకట్టుకున్నాయి.శ్రీమతి.కామేశ్వరి మరియు శ్రీమతి.సచ్చి యశోద శిష్య బృంద స్వరాభిషేకం భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com