హైదరాబాద్ లో యువకుడి ప్రాణాలను బలిగొన్న అతి వ్యాయామం

హైదరాబాద్ లో యువకుడి ప్రాణాలను బలిగొన్న అతి వ్యాయామం

హైదరాబాద్:అతి వ్యాయామం ఓ యువకడి ప్రాణాలను బలికొంది..ఎస్.ఆర్.నగర్ లో నివాసముండే ఆదిత్యా స్థానిక గోల్డెన్ జిమ్ లో వ్యాయామం చేస్తున్నాడు.. అయితే ఈ రోజు జిమ్ చేసిన తరువాత రూంకి వెళ్లిన తరువాత ఛాతి నొప్పిరావడంతో ఆసుపత్రి తీసుకెళ్లే లోపు మరణించాడు. కాగా పంజాబ్ కు చెందిన ఆదిత్య డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఎస్.ఆర్. నగర్ లోని గోల్డెన్ జిమ్ కు వచ్చి వ్యాయామం చేస్తున్నాడు. సోమవారం ఉదయం జిమ్ లో చాలా సేపు ఎక్సర్ సైజ్ చేసిన ఆదిత్య.. జిమ్ లో ఎక్కువసేపు వ్యాయామముతో ఒక్కసారిగా నీరసించి ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయాడు.

జిమ్ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లేట్ ఇచ్చారు. టాబ్లేట్ వేసుకున్నాక ఆదిత్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఛాతీలో నొప్పిగా ఉందని ఆదిత్య చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే ఆదిత్య చనిపోయినట్టు వైద్యుల నిర్ధారించారు. దాంతో గోల్డెన్ జిమ్ పై ఎస్.ఆర్. నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదయింది. ఆదిత్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. మరోవైపు అధిక సమయం జిమ్ లో ఎక్సర్ సైజ్ చేయించడంతో ఆదిత్య మృతి చెందాడని మృతుని స్నేహితులు ఆరోపిస్తున్నారు.

Back to Top