'ఈగ' విలన్‌తో కండలవీరుడు
- May 05, 2019బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్... తనతో గొడవకు దిగిన 'ఈగ' విలన్ సుదీప్ కిచ్చాకు తాట తీస్తున్నారు. ఇది రియల్ కాదు... 'రీల్ సీన్'. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. త్వరలో రిలీజ్ కాబోయే తన సినిమా 'భారత్' ఫ్రమోషన్లో పాల్గొంటూనే మరోవైపు 'దబంగ్-3' షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. 'దబంగ్-3' ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ నేపధ్యంలో సల్మాన్ ప్రస్తుతం విలన్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో విలన్‌గా 'ఈగ' నటుడు సుదీప్ కిచ్చా నటిస్తున్నారు. తాజాగా సుదీప్ ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికింద 'ఎండలు మండిపోతున్నాయి. వీటిని తట్టుకోవడం కష్టంగా ఉంది. అయితే సెట్లో అందుతున్న ఎనర్జీతో ఎండల ప్రభావం పడటం లేదు. షూటింగ్‌తో రోజంతా ఉత్సాహంగా గడచిపోతోంది. చిత్ర యూనిట్ ఎంతగానో శ్రమిస్తోంది. ఇంట్లో ఉన్నభావననే ఇక్కడ కల్పిస్తున్నందుకు సల్మాన్ సర్‌కు థ్యాక్స్' అని రాశారు. కాగా 'దబంగ్-3'కి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..