‘దొరసాని’ టీజర్ కు అద్భుతమైన స్పందన
- June 06, 2019రియలిస్టిక్ లవ్ స్టోరీగా రాబోతోన్న సినిమా ‘దొరసాని’.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో కాగా.. యాంగ్రీ యుంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
సరేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం టీజర్ లోనే హైలెట్ గా కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ వర్మ సంగీతం సమకూర్చారు.. చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్