'కొబ్బరి మట్ట' రిలీజ్ డేట్
- June 20, 2019బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ నటించిన కొబ్బరి మట్ట చిత్రం ఎట్టకేలకి విడుదలకి సిద్ధమైంది. 2015లో కొబ్బరి మట్ట అనే చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం జూలై 19న విడుదల కానుందంటూ టీం పోస్టర్ ద్వారా ప్రకటించింది. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. కొబ్బరి మట్ట చిత్రానికి సంబంధించి గతంలో పలు సాంగ్స్, టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని టీం చెబుతుంది. 'హృదయ కాలేయం', 'సింగం 123' తర్వాత కొన్ని చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు కొబ్బరి మట్ట చిత్రంతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..