'ఆర్ఆర్ఆర్'కు ఆలియా భట్ రూపంలో మరో షాక్..!
- June 21, 2019రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ సినిమా షూటింగ్ ఏ ముహుర్తాన మొదలైందో గానీ.. వరుసపెట్టి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మొదటి షెడ్యూల్ సమయంలో హీరో రామ్ చరణ్‌కు గాయం కాగా.. కొద్దిరోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా చేతికి గాయం కావడంతో కొన్ని రోజులు షూటింగ్‌ను ఆపేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు మరోసారి అవరోధం ఏర్పడింది.
వారణాసిలో 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ సమయంలో అలియా భట్ పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడి.. వెంటనే అమెరికా వెళ్లిపోయిందని సమాచారం. ఆమె అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్ అనంతరం 'బ్రహ్మాస్త్ర'.. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో పాల్గొంటానని రాజమౌళికి మెసేజ్ పెట్టిందట. ఇప్పటికే లేట్ అవుతూ వస్తున్న 'ఆర్ఆర్ఆర్'కు ఇది మరో పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!