హెచ్‌వన్‌బి వీసాలపై ఎలాంటి పరిమితుల్లేవ్!
- June 21, 2019
హెచ్‌వన్‌బి వర్క్‌వీసాలకు పరిమితులు విధించాలని ట్రంప్ యంత్రాంగానికి ఎలాంటి ఆలోచనలేదని అమెరికా హోం శాఖ వెల్లడించింది. విదేశీ కంపెనీలు తమ డేటాను స్థానికంగా నిల్వచేయాలన్న నిబంధనల అమలుకు హెచ్‌వన్‌బి వీసాలను పరిమితులు విధించాలన్న ప్రచారం భారీ ఎత్తున కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే డేటా స్టోరేజి అవసరం ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ నిబంధన వర్తింపచేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. హెచ్‌వన్‌బి వీసాలను అమెరికాపరంగా కేవలం నైపుణ్యం అత్యధికంగా ఉన్న సిబ్బందికి మాత్రమే జారీచేస్తుంది. ఈ ప్రచారం కేవలం అపోహలేనని, ఎలాంటి పరిమితులు విధించాలని నిర్ణయించలేదని అమెరికా హోంశాఖ వెల్లడించింది.
విదేశీ కంపెనీలు తమ డేటాను స్థానికంగానే నిల్వచేయాలన్న నిబంధనపై హెచ్‌వన్‌బి వర్క్‌వీసాలకు ఎలాంటి సంబంధంలేదని డేటాను మాత్రం స్థానికంగానే నిల్వచేసుకోవాల్సి ఉంటుందని హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. ట్రంప్ నినాదం బైఅమెరికన్, హైర్ అమెరికన్ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇపుడు సమీక్షకు వస్తున్నాయి. అమెరికా ఉద్యోగ వీసా విధానాలను కూడా సమీక్షించాల్సిన తరుణం ఏర్పడింది. హెచ్‌వన్‌బి కార్యక్రమంపరంగా ఒక నిర్దిష్టమైన దేశానికి మాత్రమే అమలుచేయడంలేదని ఆమె వెల్లడించారు. భారత్‌తో తమ చర్చలకు ఈ విధానానికి సంబంధంలేదని, వివిధ దేశాలు దాటిసైతం వెళ్లేందుకు వీలుగా డేటా స్టోరేజిపరంగా నిబంధనలు విధిస్తున్నది.
ఇక్కడి విదేశీ కంపెనీలు స్థానికంగానే డేటా నిల్వచేయాల్సి ఉంటుందని వివరించారు. అంతకుముందు భారత్‌సైతం అమెరికాతో హెచ్‌వన్‌బి వీసాలపరంగా చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగప్రతినిధి రవీష్‌కుమార్ వెల్లడించారు. అయితే అమెరికా ప్రభుత్వం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారంలేదని వివరించారు. రక్షణమంత్రి మైక్‌పాంపియో వచ్చేవారం భారత్ పర్యటిస్తున్నందున ఈ అంశం కూడా ప్రస్తావనకు రానున్నది. అలాగే రెండుదేశాల మధ్య ఇప్పటివరకూ పెండింగ్‌లో ఉన్న ఒప్పందాలపై సమీక్షించేందుకు వస్తున్నట్లు తేలింది.
ఇద్దరు సీనియర్ భారత్ అధికారులు మాట్లాడుతూ గతవారమే అమెరికా హెచ్‌వన్‌బి వీసాలను సాలీనా ఇచ్చే సంఖ్యను కుదించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సాలీనా ఇచ్చే వీసాల్లో భారతీయులకు పది నుంచి 15శాతం వరకూ ఇస్తోంది. మొత్తం 85వేల హెచ్‌వన్‌బి వర్క్‌వీసాల్లో నిర్దిష్టమైన దేశానికి అంటూ ప్రత్యేక నిబంధనలు ఏమీలేవు. అయితే అమెరికా జారీచేసే వీసాల్లో ఇపుడు 70శాతం భారతీయులకే వస్తున్నట్లు అంచనా.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..