ప్రవాసాంధ్రుల కోసం 'తానా' టోల్ ఫ్రీ సేవలు ప్రారంభం...
- August 03, 2019అమెరికా:ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అంటే అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలలో అతి పెద్ద సంఘం అనే చెప్పాలి. తానా చేపట్టే సేవా కార్యక్రమాలు కేవలం అమెరికాలో ఉంటున్న ప్రవాసీయులకే మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో చేపడుతూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆపదలో ఉన్న వారి సమస్యలపై సత్వరమే స్పందించడంలో తానా ఎప్పుడూ ముందుంటుంది.
అయితే తమ సేవలని మరింతగా విసృతం చేయడానికి, ఆపద సమయంలో ఉన్న తెలుగు వారికోసం తానా మరొక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అదే తానా టోల్ ఫ్రీ నెంబర్. ఈ సేవలని తానా టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో నిర్వహించేలా ప్రణాలికలు రూపొందించింది. ఈ సేవలని ప్రారంభించినట్టుగా టీమ్ స్క్వేర్ అధ్యక్షుడు కొల్లా అశోక్ బాబు తెలిపారు.
1855 OUR TANA అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమని సంప్రదించ వచ్చునని అశోక్ బాబు అన్నారు.అంతేకాదు ఈ సేవలని కేవలం తానా టీమ్ స్క్వేర్ మాత్రమే కాకుండా తానా అడ్హాక్ కమిటీల ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేపడుతామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా