స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- May 16, 2024
దోహా: స్లోవాక్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో పై హత్యాయత్నాన్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది ఆమోదయోగ్యం కాని నేరపూరిత చర్యగా పరిగణించింది. అతను త్వరగా కోలుకోవాలని తన ఆకాంక్షలను వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన వారిని విచారించి, వారపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని సూచించింది. నిందితుల ఉద్దేశ్యాలతో సంబంధం లేకుండా రాజకీయ హత్యలతో సహా హింస, ఉగ్రవాదం మరియు నేరపూరిత చర్యలను తిరస్కరించే ఖతార్ దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడేందుకు స్లోవేకియా ప్రభుత్వానికి ఖతార్ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తుందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







