హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం

- May 16, 2024 , by Maagulf
హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్ లో చాలా చోట్ల భారీ వర్షం కుమ్మేసింది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. మేడ్చల్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వైపు వర్షం వ్యాపించింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కూకట్పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, రాంనగర్, కోఠి, బేగంబజార్, మెహిదీపట్నం, మాసబ్ట్యాంక్, హైటెక్సిటీ, ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

అంతేకాక ఉప్పల్ ప్రాంతంలోనూ దట్టమైన మేఘాలు ఆవరించాయి. ఈరోజు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా ప్లే ఆఫ్ దశకు చేరాలంటే ఈ మ్యాచ్ లో గెలుపు సన్ రైజర్స్ కు ఎంతో అవసరం.

అయితే, ఉప్పల్ పరిసరాల్లో వర్షం పడే అవకాశం ఉండడంతో సన్ రైజర్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అటు, ముందుజాగ్రత్తగా ఉప్పల్ స్టేడియంలో పిచ్ ను గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్ లో కూడా చాలా భాగం కవర్లతో కప్పివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com