ఇస్రోలో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా నియామకం
- August 07, 2019ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనుబంధ సంస్థ అయిన విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ VSSC ఉద్యోగాల భర్తీ చేపట్టింది. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఆగస్ట్ 17న జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు. అభ్యర్థులు www.mhrdnats.gov.in లేదా www.sdcentre.org వెబ్సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. కేరళలోని ఎర్నాకులం జిల్లా కలామస్సెరీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆగస్ట్ 17న ఉదయం 9.30 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు మొత్తం: 158.. ఆటోమొబైల్: 8.. కెమికల్: 25.. సివిల్: 8.. కంప్యూటర్ సైన్స్: 15.. ఎలక్ట్రికల్: 10.. ఎలక్ట్రానిక్స్: 40.. ఇన్స్ట్రుమెంట్: 6.. మెకానికల్: 46.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!