జూలై 22న కబాలి చిత్రం విడుదల ..
- July 05, 2016
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ విడుదల తేది ఎప్పుడుంటుందా అనే దానిపై అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతుండగా, రిలీజ్ డేట్ విషయంలో గంటకొక వార్త పుట్టుకొస్తుంది. మొన్నటి వరకు జూలై 15న రిలీజ్ అన్న వారు ఆ తర్వాత జూలై 29న ఉంటుందని తెలిపారు. అందుకు ఓ కారణం కూడా ఉంది. మలేషియాలో జూలై 29 రిలీజ్ డేట్ తో పెద్ద పెద్ద పోస్టర్లు వేసి ప్రమోషన్‌లు చేసారు. ఇప్పుడు జూలై 22న కబాలి చిత్రం విడుదల కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సాక్ష్యంగా జూలై 21న మలేషియాలో కబాలి ప్రీమియర్ షోకి సంబంధించి టిక్కెట్స్ ట్విట్టర్‌లో పెట్టారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ఎన్యూ సెంట్రల్ సినిమా హాల్లో 21న రాత్రి 9 గంటల 1 నిమిషానికి ప్రీమియర్ షో ఉండనున్నట్టు టిక్కెట్ల మీద ప్రింట్ చేశారు. మరి దీంతో రజినీ అభిమానులకు ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ డేట్‌నైన చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటిస్తుందా, లేక మరోసారి వాయిదా వేస్తుందా అనేది చూడాలి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







