ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల తెగ్గోత భారీగా
- July 05, 2016
వచ్చే ఐదేళ్లలో భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల తెగ్గోత భారీగా జరగనుంది. యూఎస్ అధ్యయన సంస్థ ప్రకారం.. ఐటీ పరిశ్రమలో ఆటోమిషన్‌ను అమలు చేయడం ద్వారా ఈ సెక్టార్‌లో పనిచేస్తున్న తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు సర్వే వెల్లడించింది. వీరి సంఖ్య 6.4 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా నాస్కామ్ అభిప్రాయం ప్రకారం... ఆటోమిషన్ కానీ రోబోటిక్స్ వినియోగం కానీ ఐటీ పరిశ్రమను ఎలా లీడ్ చేస్తదో ఎవరికీ తెలియదు. ఆటోమిషన్ రాకవల్ల కొంత ప్రభావం పడనుంది. కానీ కొత్త టెక్నాలజీ వినియోగం వల్ల నూతన ఉద్యోగాల కల్పన సైతం జరుగుతదని పేర్కొంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ స్పేస్‌లో అదేవిధంగా బీపీవో రంగంలో ఆటోమిషన్ వల్ల తీవ్ర ప్రభావం పడనుంది. ఆటోమిషన్ వినియోగం వల్ల ఒకవైపు తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు 30శాతం పడిపోనుండగా మరోవైపు మీడియం స్కిల్డ్ ఉద్యోగాలు 8 శాతం, అదేవిధంగా హై స్కిల్డ్ ఉద్యోగాలు 56 శాతం పెరగనున్నట్లు ఐటీ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







