దుబాయ్ లో 10 రోజుల్లో 33 మంది బెగ్గర్స్ అరెస్టు..!!
- March 16, 2025
దుబాయ్: దుబాయ్ పోలీసులు రమదాన్ మొదటి 10 రోజుల్లో 33 మంది బెగర్స్ ను అరెస్టు చేసినట్లు అధికార యంత్రాంగం ఆదివారం ప్రకటించింది. అధికార యంత్రాంగం బెగ్గర్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ దేశాలకు చెందిన ఈ వ్యక్తులను అరెస్టు చేశారు. అంతకుముందు, రమదాన్ మొదటి రోజున తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
యూఏఈలో బెగ్గింగ్ అనేది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. 5,000 దిర్హామ్‌ల జరిమానాతోపాటు మూడు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. బెగ్గింగ్ కోసం ఇతర దేశాలను నుండి వ్యక్తులను నియమించే వారికి ఆరు నెలల జైలు శిక్ష, 100,000 దిర్హామ్స్ జరిమానా విధించబడుతుంది. దాంతోపాటు అనుమతి లేకుండా నిధులను సేకరించడం చేస్తే 500,000 దిర్హామ్స్ వరకు జరిమానా విధించబడుతుంది. బెగ్గర్స్ కనిపిస్తే 901 లేదా దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్‌లోని 'పోలీస్ ఐ' సేవ ద్వారా నివేదించాలని, అలాగే 'ఈ-క్రైమ్' ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వివరాలు అందించాలని కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!







