ఈదియా ATM లొకేషన్లను ప్రకటించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!

- March 16, 2025 , by Maagulf
ఈదియా ATM లొకేషన్లను ప్రకటించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!

దోహా, ఖతార్: ఈదియా ATM లు మార్చి 16 నుండి అందుబాటులో వచ్చాయని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రకటించింది. 10 ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ఈ ATM ల ద్వారా 5, 10, 50-100 డినామినేషన్లలో ఖతార్ రియాల్స్‌ను తీసుకోవచ్చని వెల్లడించింది. 

ఈదియా ATM స్థానాలు:

• ప్లేస్ వెండోమ్

• మాల్ ఆఫ్ ఖతార్

• అల్ వక్రా ఓల్డ్ సౌక్

• దోహా ఫెస్టివల్ సిటీ

• అల్ హజ్మ్ మాల్

• అల్ మిర్కాబ్ మాల్

• వెస్ట్ వాక్

• అల్ ఖోర్ మాల్

• అల్ మీరా-ముయిథర్

• అల్ మీరా-తుమామా

QCB ఈదియా ATM సర్వీస్ అనేది ఈది సాంప్రదాయ ఆచారాన్ని తిరిగి తీసుకురావడం ద్వారా ఖతారీ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని సాధారణంగా పిల్లలకు పండుగ రోజు ఇచ్చే బహుమతి కింద అందజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com