మక్కా, మదీనాలోని 79 హాస్పిటాలిటీ కేంద్రాలు మూసివేత..!!
- March 16, 2025
మక్కా: అవసరమైన లైసెన్స్‌లు పొందకుండా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినందుకు మక్కా, మదీనాలోని 79 ఆతిథ్య కేంద్రాలకు జరిమానా విధించడంతోపాటు వాటిని పర్యాటక మంత్రిత్వ శాఖ మూసివేయించింది. రమదాన్ మొదటి రెండు వారాల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డ మక్కాలోని 58 ఆతిథ్య కేంద్రాలు, మదీనాలో 21 ఆతిథ్య సౌకర్యాలకు మొత్తం SR 500,000 జరిమానాలు విధించింది.
పర్యాటక చట్టం మరియు నిబంధనలను ఉల్లంఘించే కేంద్రాలపై చట్టబద్ధమైన జరిమానాలను విధిస్తూనే ఉంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ జరిమానాలు SR1 మిలియన్ వరకు ఉంటాయని, మూసివేత లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అన్ని టూరిస్ట్ హాస్పిటాలిటీ కేంద్రాలు పర్యాటక చట్టం, దాని నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని.. ఆపరేషన్‌కు ముందు అవసరమైన లైసెన్స్‌లను పొందాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరింత సమాచారంకోసం నంబర్ 930 కు కాల్ చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







