తెలంగాణ: ఆ రెండు రోజులు వర్షాలు..
- March 16, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 21 నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 21, 22 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
దీంతో ఎండల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది. మరోవైపు, తెలంగాణలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపారు.
కొన్ని రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం అయ్యే వరకు ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2024 వేసవితో పోల్చితే ఈ సారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది.
ఆదిలాబాద్‌లో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం సమయాల్లో అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని అంటున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత మరీ అధికంగా ఉంది.రానున్న వారం–పది రోజుల్లో మాత్రం కొద్దిగా భిన్నమైన వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి 19 వరకు వేడిగాలులు ఉంటాయని అంటున్నారు.ఆ తర్వాత అకాల వర్షాలు కురిస్తాయని చెబుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







