కారు పాడైందా, ట్యాక్సీ ఫ్రీ!
- July 05, 2016
వాహనదారులకు శుభవార్త. ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రమాదవశత్తూ మీ కారు డ్యామేజ్ అయితే, అక్కడినుంచి మీరు చేర్చాల్సిన చోటకు మిమ్మల్ని తీసుకెళ్ళేందుకు ఉచితంగా ట్యాక్సీ సర్వీసును అందించనుంది. దీని కోసం అదనంగా మీరేమీ ప్రీమియమ్ చెల్లించాల్సిన అవసరం లేదు. యూఏఈలో తొలిసారిగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ 'కవర్ గ్యారంటీ' రేంజ్ 300 దిర్హామ్‌ల నుండి 500 దిర్హామ్‌ల వరకు ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇర్‌ఎస్‌ఎ ఇన్స్సూరెన్స్ కంపెనీ ఈ మేరకు వాహనదారులకు శుభవార్త చెప్పింది. అలాగే ప్రమాదానికి గురైన వాహనం నుంచి విలువైన వస్తువులు దొంగిలించబడితే, వాటిని కూడా కాంపెన్సేట్ చేసేలా వెసులుబాట్లు కల్పించనున్నట్లు ఇన్స్సూరెన్స్ కంపెనీ వర్గాలు తెలిపాయి. లాక్ రీప్లేస్‌మెంట్, డోర్ లాక్స్, బూట్ లాక్, ఇగ్నిషన్ మరియు స్టీరింగ్ లాక్, కార్ లాక్ ట్రాన్స్‌మిషన్‌ని కూడా ఇన్స్యూరెన్స్ కవరేజ్ విభాగంలోకి తీసుకొచ్చారు. ఈ విషయాల్ని బహ్రెయిన్ యూఏఈలో ఆర్‌ఎస్‌ఎ ఇన్స్యూరెన్స్ కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ ఎకె రవీంద్రన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!









