సేఫ్ ఈద్: దుబాయ్ పోలీసుల విజ్ఞప్తి
- July 05, 2016
దుబాయ్ పోలీసులు, పౌరులకు ఈద్ శుభాకాంక్షలు ముందస్తుగా తెలుపుతూ, తగిన సూచనలు కూడా చేశారు. ప్రమాదాల పట్ల రెసిడెంట్స్ అప్రమత్తంగా ఉండాలని కోరారు. దుబాయ్ పోలీస్ ప్రొటెక్టివ్ సెక్యూరిటీ అండ్ ఎమర్జన్సీ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా అలి అల్ గైతి మాట్లాడుతూ, ఈద్ సందర్భంగా ఫైర్వర్క్స్కి దూరంగా ఉండాలని కోరారు. ఫైర్ వర్క్స్‌ని వినియోగించకూడదనీ, ఎవరైనా ఫైర్ వర్క్స్ గురించిన సమాచారం తెలిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. 'స్టాప్ స్టే సేఫ్' పేరుతో ఫైర్ వర్క్స్‌కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ కూడా ప్రారంభించిందని ఆయన తెలిపారు. తనిఖీల్లో భాగంగా 22,153 ఫైర్క్రాకర్స్ని పట్టుకున్నట్లు వివరించారాయన. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనీ, ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మర్జోయి చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించేవారి సమాచారాన్ని పౌరులు పోలీసులకు తెలియజేయవచ్చన్నారు. ఈద్ సెలవుల కారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఆహ్లాదం కోసం వెళ్ళేవారు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని ఈద్ సెలవుల్ని ఎంజాయ్ చెయ్యాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







