కేరళలో యూఏఈ కాన్సులేట్
- July 05, 2016
భారతదేశంలో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో యూఏఈ త్వరలో కొత్త కాన్సులేట్‌ని ప్రారంభించనున్నట్లు తెలియవస్తోంది. ఆగస్ట్‌లో ఈ కాన్సులేట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తిరువనంతపురంలో ఈ కాన్సులేట్ ఏర్పాటు కానుందని సమాచారమ్. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ త్వరలోనే ఈ ప్రకటన చేయనుందట. 2011లోనే యూఏఈ, కేరళలో కాన్సులేట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. యూఏఈలో భారతదేశం నుంచి వస్తున్న వలసదారుల్లో కేరళీయులే ఎక్కువ. దాంతో కాన్సులేట్ కేరళలో ఏర్పాటు చేయవలసిందిగా భారతదేశం తరఫున కూడా యూఏఈకి విజ్ఞప్తులు అందాయి. కేరళలో కాన్సులేట్ కార్యాలయం రానుండడాన్ని ఇండియన్ అంబాసిడర్ సీతారామన్ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. యూఏఈలో భారతీయ వలసదారుల్లో 50 శాతం మంది కేరళీయులేనని ఆయన తెలిపారు. కాన్సులేట్ ఏర్పాటుతో యూఏఈ - భారత్ మధ్య ప్రయాణాల సంఖ్య ఇంకా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







