భూమి మీదకు వచ్చేస్తున్న సునీతా విలియమ్స్
- March 18, 2025
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణం కొనసాగుతోంది. ఐఎస్ఎస్ నుంచి స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్‌లోకి వారిద్దరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు చేరుకున్నారు.ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐఎస్ఎస్ నుంచి విడిపోయింది.
అన్‌డాకింగ్ ప్రక్రియ అనంతరం స్పేస్‌క్రాఫ్ట్ భూమి దిశగా బయలుదేరింది. బుధవారం తెల్లవారాజుమున భూవాతావరణంలోకి అది ప్రవేశిస్తుంది. ఆ వెంటనే ఇంజిన్ల ప్రజ్వలన చేపడతారు. అనంతరం తెల్లవారాజుమున 3.27 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లోకి వస్తుంది. వ్యోమగాములను అక్కడి సహాయ బృందాలు బయటకు తీసుకువస్తాయి.
అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక విడిపోయే ప్రక్రియ ముగియడంతో నాసా ప్రత్యక్ష ప్రసారం ఆపేసింది. ప్రస్తుతం ఆడియో ద్వారా మాత్రమే వివరాలు తెలుపుతోంది. బుధవారం తెల్లవారుజాము 2.15 గంటలకు మళ్లీ లైవ్ ప్రారంభం కావచ్చు.
ఈ ప్రక్రియలు అన్నీ జరిగే వరకు అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. 2024 జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇన్ని నెలలకు భూమి మీదకు వస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్ దీపావళి, థాంక్స్ గివింగ్ వంటి వేడుకలను జరుపుకున్నారు. డిసెంబర్లో ఐఎస్ఎస్ నుంచే విద్యార్థులతో ఆమె మాట్లాడారు. ఐఎస్ఎస్లో జ్యూస్ ఎలా తాగుతారో కూడా చూపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







