‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- August 15, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తరాల పోరాట పటిమ–‘వికసిత్ భారత్’లో మన పాత్ర
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక భావోద్వేగ సందేశాన్ని ఇచ్చారు. మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ఒక తరం తీవ్రంగా పోరాడితే, ఆ స్వాతంత్ర్యాన్ని, దేశ సమగ్రతను కాపాడటానికి మరొక తరం కృషి చేసింది అని బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్’ (Viksit Bharat) సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తనదైన కీలక పాత్రను పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంతో సమన్వయం.. అభివృద్ధికి భరోసా
కేంద్ర ప్రభుత్వంతో పరిపూర్ణ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అంతకుముందు మైదానానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు మరియు నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







