ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- August 15, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. దేశ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడమే మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు.
త్యాగాల పునాదులపై స్వాతంత్ర్యం–ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ఎందరో మహనీయుల పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగానే మనకు ఈ స్వాతంత్ర్యం సిద్ధించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. “దేశం నాకు ఏం చేసిందని కాకుండా, దేశానికి నేను ఏం చేయగలనని ప్రతి ఒక్కరూ ‘అనే నేను..’ సంకల్పంతో ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా, గుండెల్లో దేశ అభివృద్ధి కోసం బలమైన అజెండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధించాలన్న అద్భుతమైన లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. భారతదేశం 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే నాటికి మన దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు, వికాసం నుంచి వైభవం వైపు పయనించాలని ఆకాంక్షించారు. ఈ గొప్ప సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ప్రజలందరూ ఐక్యంగా అడుగులు వేయాలని పిలుపునిస్తూ, తన సందేశాన్ని ‘జై తెలుగుతల్లి! జై హింద్!’ నినాదాలతో ముగించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







