వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- August 15, 2026
-వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులం, కలిసి కట్టుగా నడుద్దాం, వికసిత్ భారత్ దిశగా అడుగులేద్దాం-
-న్యూఢిల్లీ త్యాగరాజ్ మార్గ్ లోని అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పూర్వ ఉపరాష్ట్రపతి
-వికసిత భారత్ నిర్మాణమే...స్వరాజ్య సముపార్జనకు బలిదానం చేసిన మహనీయుల అందించే నిజమైన నివాళి
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని, ఈ క్రమంలో వివక్షలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధికి చోదక శక్తులు కావడంతో పాటు, అభివృద్ధి ఫలాలను అందుకోవడంలో భాగస్వాములు కావాలని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీ త్యాగరాజ్ మార్గ్ లో ఉన్న పూర్వ ఉపరాష్ట్రపతి గారి అధికారిక నివాసంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయుల స్మృతికి ఈ సందర్బంగా నివాళులు అర్పించిన ఆయన, వికసిత భారత్ నిర్మాణమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
భారతదేశంలో అక్కడక్కడా పేరుకుపోయిన వివక్షతలు, సమస్యలకు వ్యతిరేకంగా ప్రతి యువకుడూ సమష్టిగా ముందుకు సాగాలన్న పూర్వ ఉపరాష్ట్రపతి, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న గౌరవ ప్రధాన మంత్రి పిలుపునకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా ముందడుగు వేయాలని సూచించారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమనే స్ఫూర్తిని అందిపుచ్చుకుని... కలిసి కట్టుగా పని చేస్తూ, మన యువతను ప్రోత్సహిస్తే...వారు చోదక శక్తులుగా మారి వికసిత భారత నిర్మాణాన్ని వేగవంతం చేయగలరని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







