50,000 దిర్హామ్‌లకు పైగా స్వాధీనం..107 మంది బెగ్గర్స్ అరెస్టు..!!
- March 19, 2025
షార్జా: ఈ సంవత్సరం రమదాన్ సందర్భంగా భిక్షాటనపై నిర్వహించిన భారీ దాడిలో షార్జా పోలీసులు 107 మంది వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి 50,000 దిర్హామ్‌లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో 87 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారని అధికార యంత్రాంగం తెలిపింది. 'బెగ్గింగ్ నేరం, దానం ఒక బాధ్యత' అనే శీర్షికతో నిర్వహించిన అవగాహన ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ఆపరేషన్, ప్రజల సానుభూతి ఆధారంగా జరిగే దోపిడీని అరికట్టడంతోపాటు నిజమైన అవసరం ఉన్నవారికి విరాళాలను మళ్లించడం లక్ష్యంగా పెట్టుకుందని స్పెషల్ టాస్క్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ఒమర్ అల్ గజల్ తెలిపారు. ప్రత్యేక హాట్‌లైన్ నంబర్లు (901) మరియు (80040) ద్వారా బెగ్గర్స్ కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







