ఇఫ్తార్ విందుకు వెళ్తుండగా ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి..!!
- March 19, 2025
యూఏఈ: మార్చి 17న సాయంత్రం వాడి అల్ హెలోలో జరిగిన విషాదకరమైన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎమిరాటీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, వాహనం అనేకసార్లు బోల్తా పడి లోయలో పడటంతో మంటలంటుకున్నాయని పోలీసులు తెలిపారు. మృతులంగా 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు స్నేహితుడి ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని షార్జా పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా రమదాన్ సమయంలో ఇఫ్తార్‌కు ముందు చాలా మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వేగంగా వెళతారని, ముఖ్యంగా యువ డ్రైవర్లు రోడ్లపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







