షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు 6 రోజులపాటు ఈద్ సెలవులు..!!

- March 19, 2025 , by Maagulf
షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు 6 రోజులపాటు ఈద్ సెలవులు..!!

యూఏఈ: షార్జా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవు తేదీలను ప్రకటించింది. షార్జా ప్రభుత్వ మానవ వనరుల శాఖ ప్రకటన ప్రకారం.. ఈ సెలవుదినం షవ్వాల్ 1 నుండి షవ్వాల్ 3, 1446 AH వరకు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ రంగంలో అధికారిక పనిదినాలు తిరిగి షవ్వాల్ 4, 1446 AH న తిరిగి ప్రారంభమవుతాయి. నెలవంక కన్పించడాన్ని బట్టి, ఈద్ అల్ ఫితర్ మార్చి 30న (ఆదివారం) వస్తే, షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 1 (మంగళవారం) వరకు ఐదు రోజులపాటు సెలవులు లభిస్తాయి.ఇక మార్చి 31 (సోమవారం) పండుగ ప్రారంభమైతే, ఉద్యోగులకు మార్చి 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 2 (బుధవారం) వరకు ఆరు రోజులపాటు సుదీర్ఘంగా సెలవులు లభిస్తాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com