భారతదేశంలో గురువారం జరుపుకోనున్న ఈద్-ఉల్-ఫితర్

- July 05, 2016 , by Maagulf
భారతదేశంలో గురువారం జరుపుకోనున్న ఈద్-ఉల్-ఫితర్

ముస్లింల పవిత్ర పండగ రంజాన్‌ సందర్భంగా దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు జులై 7 గురువారం రోజున సెలవు దినంగా ప్రకటించారు. తొలుత జులై 6న ఈ సెలవును ప్రకటించగా.. దిల్లీ వ్యాప్తంగా ముస్లింలు గురువారం రంజాన్‌ వేడుకలు జరపుకోనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అదే రోజున సెలవు ఇస్తున్నట్లు పర్సనల్‌ అండ్‌ ట్రయినింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది.
కాగా.. దిల్లీ మినహా మిగతా ప్రాంతాల్లోని కార్యాలయాలు మాత్రం.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించిన తేదీ ఆధారంగా.. అక్కడి ఉద్యోగుల కమిటీ లేదా కార్యాలయ అధికారులు సెలవు దినాన్ని ప్రకటిస్తారని సదరు డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. అయితే స్టాక్‌ మార్కెట్లు మాత్రం బుధవారం సెలవుదినంగా నిర్ణయించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com