అమెరికా దాటి వెళ్లాలనుకునే వారు ఆలోచించుకోవాలి: ఇమ్మిగ్రేషన్ అటార్నీ
- March 19, 2025
హెచ్-1బీ వీసాదారులు (H-1B Visa), వారి భాగస్వాములు (F-1 Visa Holders), అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్‌కార్డుదారులకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెన్యువల్ కోసం వీరు వారి దేశాలకు వెళ్తే.. తిరిగి అమెరికాకు రావడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. స్వదేశంలోని అమెరికా కాన్సులేట్స్ స్టాంపింగ్‌లో జాప్యం, విస్తృత తనిఖీలు, తిరిగి వచ్చేటప్పుడు అమెరికా విమానాశ్రయాల్లో నిర్బంధం సహా పలు కారణాలతో గ్రీన్ కార్డు హోల్డర్లకు (Green Card Holders) ఇదే విధమైన సూచనలు చేయడం గమనార్హం.
సీటేల్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ
సీటేల్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ కృపా ఉపాధ్యాయ్ మాట్లాడుతూ… ‘‘ప్రస్తుతం అమెరికా దాటి వెళ్లాలనుకునే విదేశీయులు (ముఖ్యంగా హెచ్-1బీ వీసా లేదా ఎఫ్-1 వీసా రెన్యువల్ కోసం) ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి’’ అని ఆయన సూచించారు. ‘‘ఇంటర్వ్యూ మినహాయింపు వీసాదారులకు US ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అర్హతల్లో మార్పులు చేసింది. గతంలో దరఖాస్తుదారులు ఏదైనా కేటగిరీలో (విజిటర్స్ వీసాలు తప్ప) వలసేతర వీసా పొందిl గడువు ముగిసిన 48 నెలల్లోపు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేది.. కానీ సవరించిన నిబంధనల ప్రకారం.. 12 నెలల్లోపు గడువు ముగిసిన వలసేతర వీసాదారుల దరఖాస్తుదారులకు మాత్రమే అనుమతిస్తున్నారు.. అందువల్ల F-1 వీసా ఉన్న అంతర్జాతీయ విద్యార్థి లేదా హెచ్- 1B వీసాదారులు ఇంటర్వ్యూ స్లాట్ కోసం వేచి ఉండాలి… ఒకవేళ 12 నెలల కిందట H-1B వీసా పొందినవారికి పొడిగింపు అవసరమైతే ఇంటర్వ్యూ స్లాట్ కోసం కూడా వేచి ఉండక తప్పదు’’ అని ఉపాధ్యాయ్ చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







