గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా

- March 19, 2025 , by Maagulf
గాజా మారణహోమంపై ప్రపంచదేశాలు స్పందించాలి: సౌదీ అరేబియా

జెడ్డా: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాల దురాక్రమణను తిరిగి ప్రారంభించడాన్ని సౌదీ మంత్రుల మండలి ఖండించింది. జెడ్డాలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. అనంతరం మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ఈ నేరాలను ఆపడానికి, పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని అంతం చేయడానికి అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం బాధ్యతను క్యాబినెట్ గుర్తుచేసింది.

సెషన్ ప్రారంభంలోరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో టెలిఫోన్ ద్వారా చర్చల గురించి క్రౌన్ ప్రిన్స్ క్యాబినెట్‌కు వివరించారు. అరబ్, ప్రాంతీయ, అంతర్జాతీయ రంగాలలో తాజా పరిణామాలను మంత్రివర్గం సమీక్షించింది.  

అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య శాంతి చర్చల ముగింపును, అలాగే తజికిస్తాన్ , కిర్గిజ్స్తాన్ మధ్య సరిహద్దు విభజన ఒప్పందంపై సంతకం చేయడాన్ని మంత్రివర్గం స్వాగతించిందని అల్-దోసరీ అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com