చట్టాల ఉల్లంఘన.. రియల్ ఎస్టేట్ డెవలపర్ సస్పెండ్..!!

- March 19, 2025 , by Maagulf
చట్టాల ఉల్లంఘన.. రియల్ ఎస్టేట్ డెవలపర్ సస్పెండ్..!!

యూఏఈ: ఇటీవల ప్రాపర్టీ కొనుగోలుదారులను రక్షించడానికి అబుదాబి రియల్ ఎస్టేట్ చట్టాలను కఠినతరం చేసింది. ఎమిరేట్‌లో చట్టాలను ఉల్లంఘించినందుకు అధికారులు ప్రాపర్టీ యజమానులకు జరిమానా విధిస్తున్నారు. ఇందులో సైట్‌లను నిర్లక్ష్యం చేయడం లేదా లైసెన్స్ లేని ప్రాజెక్టులను ప్రోత్సహించిన ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్‌ను ఇటీవల సస్పెండ్ చేసినట్లు అబుదాబి రియల్ ఎస్టేట్ సెంటర్ (ADREC) ప్రకటించింది. అందరూ డెవలపర్‌లు చట్టం, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. ఏదైనా ప్రమోషనల్ కార్యకలాపాలను నిర్వహించడానికి ముందు అవసరమైన లైసెన్స్‌లను పొందాలన్నారు.

2022లో రియల్ ఎస్టేట్ మోసాలు, నకిలీ ఏజెంట్లు, లేని ప్రాజెక్టులు, ఆఫర్‌ల ఆన్‌లైన్ జాబితాలను పరిష్కరించడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్ DARIని అబుదాబి ప్రారంభించింది. ఇందులో DMT-ఆమోదించిన అధికారిక ప్రాజెక్టుల వివరాలను పొందుపరిచారు.    

ఇటీవల, అబుదాబి మునిసిపాలిటీ.. అనుమతులు లేకుండా ప్రాపర్టీలలో మార్పులు చేసే యజమానులపై భారీ జరిమానాలు విధించడం ప్రారంభించింది.  ఉల్లంఘనలు రిపీట్ అయితే Dh20,000 వరకు భారీ జరిమానాలు విధించబడతాయి. కనీస జరిమానా Dh5,000 నుండి ప్రారంభమై రెండవ ఉల్లంఘన కింద Dh10,000 వరకు విధిస్తారని హెచ్చరించారు.

రియల్టీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది విదేశీ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు వస్తున్నందున, దేశవ్యాప్తంగా ఎమిరేట్‌లు పారదర్శకతను మెరుగుపరచడానికి,కొనుగోలుదారులను రక్షించడానికి చట్టాలను కఠినం చేశాయి. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ (రెరా)ను ప్రకటనలను నియంత్రించడానికి ఏర్పాటు చేశారు. గత సంవత్సరం నిబంధనలను పాటించడంలో విఫలమైన 286 రియల్ ఎస్టేట్ కంపెనీలు, బ్రోకర్లకు జరిమానా విధించారు. 2024లో రియల్ ఎస్టేట్ ప్రకటనలలో పేర్కొన్న నిబంధనలు, షరతులను పాటించడంలో విఫలమైన 30 రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఒక్కొక్కరికి Dh50,000 జరిమానా విధించింది దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్. 2024 మొదటి అర్ధభాగంలో దుబాయ్‌లో ప్రకటన నిబంధనలను పాటించనందుకు 256 మంది ఆస్తి బ్రోకర్లకు జరిమానా విధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com