దుబాయ్, షార్జా మధ్య ఈజీ ట్రాఫిక్ కోసం కొత్త రూల్స్..!!
- March 19, 2025
యూఏఈ: దుబాయ్‌లో వాహనాల వృద్ధి 8 శాతం దాటింది. ఇది ప్రపంచ రేటు అయిన 2 శాతం కంటే చాలా ఎక్కువ అని ఇంధన, మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ అల్ మజ్రౌయి అన్నారు. ఈ పెరుగుదలను అసాధారణంగా అభివర్ణించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వాహన యాజమాన్యం, రిజిస్ట్రేషన్ విధానాలు, చట్టాల అవసరాన్ని సుహైల్ అల్ మజ్రౌయి వివరించారు. స్థానిక అధికారులతో ప్రయత్నాలను చేస్తున్నామని, సమన్వయాన్ని యూఏఈ ప్రభుత్వ వార్షిక సమావేశాలలో ఈ సమస్యను చేర్చాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించిందన్నారు.
సమస్యను లోతుగా అధ్యయనం చేయడానికి స్థానిక ప్రభుత్వాలు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో కూడిన బృందానికి మంత్రిత్వ శాఖ నాయకత్వం వహిస్తోందని అల్ మజ్రౌయి వివరించారు. స్థానిక సంస్థలతో కలిసి పనిచేస్తూ, సమగ్ర ప్రణాళికను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనేక పరిష్కార మార్గాలను క్యాబినెట్‌కు ప్రతిపాదించింది. ప్రతిపాదిత చర్యలలో దుబాయ్‌ను ఇతర ఎమిరేట్‌లతో అనుసంధానించే రోడ్డు కారిడార్‌ల డెవలప్ మెంట్, కొత్త రహదారుల అభివృద్ధి, దేశవ్యాప్తంగా సామూహిక రవాణా వ్యవస్థలను అనుసంధానించడం ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు నెట్‌వర్క్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కొత్త ప్రజా రవాణా పద్ధతులను ప్రవేశపెట్టాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
దుబాయ్ - షార్జా మధ్య పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఎఫ్‌ఎన్‌సి సభ్యుడు అద్నాన్ అల్ హమ్మది అడిగిన ప్రశ్నకు సమాధానంగా అల్ మజ్రౌయి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రద్దీని తగ్గించడానికి అధ్యయనాలు పూర్తయ్యాయని, 2024 రెండవ అర్ధభాగం నాటికి ఇంజనీరింగ్ పరిష్కారాలను అమలు చేస్తామని ఒక సంవత్సరం క్రితం మంత్రి తనకు తెలియజేశారని అల్ హమ్మది గుర్తు చేశారు. అయితే, ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారిందన్నారు. దుబాయ్ వాహన వృద్ధి రేటు 8 శాతం అయితే, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్‌లలో మొత్తం వాహన పెరుగుదల 23 శాతంగా ఉందని ఆయన వివరించారు. ఇది ఆయా ప్రాంతాలలో తీవ్రమైన ఆందోళనగా మారే అవకాశం ఉందన్నారు. దుబాయ్‌లోకి ప్రతిరోజూ 1.2 మిలియన్ల కార్లు ప్రవేశిస్తాయన్నారు. దుబాయ్ ట్రాఫిక్, లైసెన్సింగ్ విభాగం ప్రతిరోజూ దాదాపు 4,000 కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్‌ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి
- నేడే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు…తరలి వస్తున్న ప్రపంచదేశాల అధినేతలు
- సౌదీ అరేబియా విజన్ 2030 వార్షిక నివేదిక..ప్రధాన లక్ష్యాలు పూర్తి..!!