రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- March 20, 2025
దోహా: రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా కుదిరిన ఒప్పందాలను ఖతార్ స్వాగతించింది. ఇవి సంక్షోభానికి సమగ్రమైన, స్థిరమైన పరిష్కారానికి అందిస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపింది.
శాంతియుత మార్గాల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలనే ఖతార్ స్థిరమైన వైఖరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటిస్తుందని, ప్రాంతీయ / అంతర్జాతీయ సంఘర్షణలను పరిష్కరించడానికి చర్చలు అనేవి అత్యంత ప్రభావవంతమైన విధానం అనే తమ దృఢమైన నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేసింది.
ప్రపంచ భద్రత, స్థిరత్వాన్ని సాధించే విధంగా శాంతిని పెంపొందించడం, అదే సమయంలో దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా చేసుకున్న అన్ని ప్రయత్నాలకు ఖతార్ పూర్తి మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







