కువైట్ లో రాబోయే రెండు రోజులపాటు వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- March 21, 2025
కువైట్: ఉపరితల పీడనం విస్తరించడం వల్ల కువైట్ లో రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని కువైట్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతం అయి, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం సాయంత్రం వరకు వర్షపాతం కొనసాగుతుందని, తేలికపాటి నుండి మోస్తరు వరకు తీవ్రత మారుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. కొన్ని ప్రాంతాలలో కొన్నిసార్లు భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం, శనివారం రోజున వర్షపాతం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. దాంతోపాటు దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, ఆదివారం ఉదయం కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా తీరప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు