దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- October 14, 2025
యూఏఈ: దుబాయ్ మెట్రోలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిద్రపోవడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించడం, నిర్దేశించని ప్రాంతాల్లో కూర్చునే ప్రయాణీకులకు జరిమానాలు విధిస్తారు. ప్రతి ఒక్కరూ మెట్రోను సజావుగా నడిపించడంలో సహాయపడాలని ఆర్టీఏ కోరింది. ప్రయాణికులు చేసే సాధారణ తప్పులు, వాటికి చెల్లించాల్సిన జరిమానాలను గుర్తుచేస్తూ ఆర్టీఏ ఒక నోట్ విడుదల చేసింది.
ఇన్స్పెక్టర్లు మెట్రోను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారని మరియు నిబంధనలను పాటించని ప్రయాణీకులకు జరిమానాలు విధిస్తారని అధికారులు స్పష్టం చేసింది. ప్రయాణికులు మెట్రో స్టేషన్ సిబ్బందికి నేరుగా సంఘటనలను నివేదించవచ్చని తెలిపింది. ప్రతిరోజు దాదాపు 9లక్షల మంది దుబాయ్ మెట్రోలో ప్రయాణిస్తారు. ఈ క్రమంలో ఆర్టీఏ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
మెట్రో ఎక్కే మరియు దిగే సమయలో సంయమనం పాటించాలని కోరింది. క్యూ పద్ధతి పాటించాలని, ముందుగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇక టిక్కెట్ లేని ప్రయాణానికి 200 దిర్హమ్ ల జరిమానా విధించనున్నారు. ఇతరుల కార్డును ఉపయోగించినా, గడువు ముగిసిన కార్డును వినియోగించినా 200 దిర్హమ్ ల ఫైన్ విధిస్తారు. అనుమతి లేని ప్రాంతాంలోకి ప్రవేశించడం, నిలబడటం లేదా కూర్చోవడం, సీట్లపై పాదాలను పెట్టడం వంటి చర్యలకు 100 దిర్హాల జరిమానా విధిస్తారు. వస్తువులను అమ్మడం, ప్రమోషన్ నిర్వహించడం, విధులకు ఆటంకం కలిగించడం, నిబంధనలను ఉల్లంఘించడం చేస్తే 200, నిషేధిత ప్రాంతాలలో తినడం చేస్తే 100, నిద్రపోతే 300 దిర్హమ్ ల చొప్పున జరిమానాలు విధిస్తారు. మెట్రోలో డ్యామేజీకి పాల్పడితే 2000 దిర్హమ్ ల జరిమానా విధిస్తారు.
గైడ్ డాగ్స్ కాకుండా ఇతర జంతువులను తీసుకువస్తే 100, ఉమ్మివేయడం, చెత్త వేయడం, పరిశుభ్రతకు విఘాతనం కలిగిస్తే 200, స్మోకింగ్ చేస్తే 200, లిఫ్ట్ లు/ఎస్కలేటర్ లను దుర్వినియోగం చేస్తే 100, కదిలేటప్పుడు తలుపులు తెరిచేందుకు ప్రయత్నిస్తే 100, భద్రతకు హాని కలిగించే పదార్థాలను తీసుకెళితే 100, లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్తే 500 దిర్హామ్స్ చొప్పున జరిమానా విధిస్తారు.
ఇక 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని పెద్దలు లేకుండా అనుమతించరు. 8-11 సంవత్సరాల వయస్సు గల మైనర్లకు తల్లిదండ్రుల అనుమతి అవసరం. 12 ఆపై సంవత్సరాల వయస్సు గల మైనర్లను ఒంటరిగా ప్రయాణించడానికి అనుమతిస్తామని ఆర్టీఏ గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..