తిరుమలలో హిందువులకే ఉద్యోగం.. సీఎం చంద్రబాబు
- March 21, 2025
తిరుమల: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.తిరుమలలో శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న అనంతరం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో తిరుమలపై సమీక్ష చేపట్టారు. తిరుమల అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… గడిచిన ఐదేళ్లలో చాలా దారుణాలు జరిగాయని, తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని ఎన్నికల వేళ చెప్పానని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకున్నానని వివరించారు. అప్పట్లో ఏడు కొండలను ఆనుకుని ముంతాజ్ హోటల్ కు అనుమతి ఇచ్చారని, ఆ హోటల్ కు 20ఎకరాలు కేటాయించారని విమర్శించారు. దీనిపై తాము చర్యలు తీసుకున్నామని, మరో 35.32 ఎకరాల్లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులను కూడా రద్దు చేశామని తెలిపారు. ఏడు కొండలను ఆనుకుని వాణిజ్యపరమైన అంశాలకు అనుమతించేది లేదని ఉద్ఘాటించారు. వ్యక్తిగత ప్రయోజనాలకు చోటులేదని స్పష్టంగా చెప్పామని అన్నారు. వెంకటేశ్వరస్వామి ఆస్తులన్నీ కాపడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని, అన్నదానానికి చాలామంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు. భక్తులకు అన్నప్రసాదాలు స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదన్నారు. ప్రతిఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. ఏడు కొండలు వెంకటేశ్వరస్వామి సొంతమని స్పష్టం చేశారు. ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగరాదన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







