సన్‌రైజర్స్ హైదరాబాద్ యాంథమ్ రిలీజ్..
- March 23, 2025
హైదరాబాద్: ఐపీఎల్ 2025లో తన సత్తా చూపించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ అయ్యింది. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరుకున్న సన్‌రైజర్స్ తృటిలో కప్పును చేజార్చుకుంది. నాటి ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది.అయితే.. ఈ సారి ఎలాగైనా సరే కప్పును ముద్దాడాలని ఎస్ఆర్‌హెచ్ టీమ్ పట్టుదలగా ఉంది.
ఈ క్రమంలో ఐపీఎల్ 18వ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం (మార్చి 23)న తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ ఆడే ముందు ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్తగా రూపొందించిన యాంథమ్ సాంగ్ సైలెంట్‌గా రిలీజ్ చేసింది.
సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ప్రకటన చేయకుండానే విడుదల చేసింది. ‘సన్‌రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో..’ అంటూ పాట సాగుతోంది. ‘బ్యాట్ పట్టాలే సిక్స్ కొట్టాలే.. ఆరెంజ్ ఆర్మీ ఆటే సునామీ..’ అనే పదాలు ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తున్నాయి. మొత్తంగా పాట అదరిపోయింది.
ఇప్పటి వరకు ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ జట్లు 20 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించగా, 11 మ్యాచ్‌ల్లో ఆర్ఆర్ గెలిచింది. ఇక ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు 5 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సన్‌రైజర్స్ ఆధిపత్యంలో కొనసాగుతోంది.
ఇక చివరి 5 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు తలపడిన సందర్భాల్లో సన్‌రైజర్స్ మూడు మ్యాచుల్లో గెలవగా, ఆర్ఆర్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







