ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి

- November 08, 2025 , by Maagulf
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి

న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఇండిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం భారీ అవ్యవస్థ చోటుచేసుకుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అవసరమైన ‘ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)’ లో సాంకేతిక లోపం కలగడంతో విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.ఈ లోపం కారణంగా 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి, అలాగే కొన్ని విమానాలు రద్దు కూడా అయ్యాయి. దీనివల్ల ప్రయాణికులు బోర్డింగ్ గేట్లు, చెక్-ఇన్ కౌంటర్ల వద్ద దీర్ఘకాలం వేచి ఉండాల్సి వచ్చింది.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రకారం, సిస్టమ్‌లో సమస్య నవంబర్ 6న (Delhi Airport Flights Delay: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి, పరిస్థితి క్రమంగా) గుర్తించబడింది. వెంటనే సివిల్ ఏవియేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతేకాక, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు అదనపు సిబ్బందిని నియమించి, విమాన ప్రణాళికలను మాన్యువల్‌గా ప్రాసెస్ చేయడం ప్రారంభించారు.ఈ లోపం నివారణ కోసం ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిపుణుల బృందంకు చేరి పర్యవేక్షణ చేపట్టింది.

AAI తెలిపిన ప్రకారం, ప్రస్తుతం వ్యవస్థ మళ్లీ పనిచేయడం ప్రారంభించింది. అయితే, backlog ఉన్నందున ఇంకా కొంతకాలం చిన్నపాటి ఆలస్యాలు నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరేందుకు కొంత సమయం పడుతుంది. సంస్థ తెలిపినట్టుగా, ఈ లోపం ఎందుకు జరిగింది అన్నదానిపై త్వరలో విచారణ ప్రారంభించబడుతుంది.

ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం,ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బయలుదేరే విమానాల సగటు ఆలస్యం 50 నిమిషాల వరకు నమోదైంది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఆకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్ అన్నీ ఈ సమస్యతో ప్రభావితమయ్యాయి. బోర్డింగ్ గేట్ల వద్ద ప్రయాణికులు భారీగా వేచి ఉండటంతో ఎయిర్‌పోర్టులో విశేష క్షోభ కనిపించింది.

ప్రస్తుతం అధికారులు అన్ని కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేస్తున్నారు. ప్రయాణికులు తమ విమానాల తాజా వివరాల కోసం ఆయా ఎయిర్‌లైన్స్‌ను నేరుగా సంప్రదించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com