టీమిండియా వెస్టిండీస్ బయలుదేరింది

- July 06, 2016 , by Maagulf
టీమిండియా వెస్టిండీస్ బయలుదేరింది

నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లి కెప్టెన్సీలోని టీమిండియా వెస్టిండీస్ బయలుదేరింది. బుధవారం ఉదయం ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి టీమ్ విండీస్ ఫ్లైట్ ఎక్కింది. కొత్త కోచ్ కుంబ్లే సహా 16 మంది టీమ్ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ విండీస్ వెళ్లారు. ఈ నెల 9, 10 తేదీల్లో విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో సెయింట్ కీట్స్‌లో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌తో విండీస్ టూర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఇదే వేదికలో జులై 14 నుంచి 16 వరకు మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. తొలి టెస్ట్ ఈ నెల 21 నుంచి ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మొదలవుతుంది. రెండో టెస్ట్ జులై 30 నుంచి ఆగస్ట్ 3 వరకు కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో, మూడో టెస్ట్ సెయింట్ లూసియాలోని సామి నేషనల్ క్రికెట్ స్టేడియంలో, నాలుగోటెస్ట్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరుగుతాయి. చివరిసారి 2011లో విండీస్ టూర్‌కెళ్లిన టీమిండియా.. మూడుటెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. ఆ సిరీస్‌తోనే టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లి.. ఇప్పుడు కెప్టెన్‌గా, టీమ్‌లో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా మరోసారి విండీస్‌కు వెళ్లడం విశేషం. విండీస్‌కు వెళ్లిన టీమ్‌: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రహానే (వైస్ కెప్టెన్‌), విజయ్‌, ధావన్‌, రాహుల్‌, పుజారా, రోహిత్‌శర్మ, సాహా, అశ్విన్‌, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్‌శర్మ, షమి, భువనేశ్వర్‌, షార్దూల్ ఠాకూర్‌, స్టువర్ట బిన్నీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com