రియాద్ లో జాయ్ రైడర్ కు SR60,000 జరిమానా..!!
- March 27, 2025
రియాద్: రెసిడెన్షియల్ ఏరియాల్లో జాయ్ రైడింగ్ చేస్తూ.. తన ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించిన వ్యక్తిని రియాద్ ట్రాఫిక్ విభాగం అరెస్టు చేసింది. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా కేసును ట్రాఫిక్ అథారిటీకి రిఫర్ చేసినట్లు పేర్కొంది. స్టంట్ డ్రైవింగ్ చేసినందుకు SR60,000 జరిమానా, డ్రిఫ్టింగ్‌లో ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి స్ట్ంట్ డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించి, అతడిని అరెస్ట్ చేశారు.
రియాద్‌లో 3 వాహనాలపై కాల్పులు.. వ్యక్తి అరెస్టు
రియాద్ ప్రాంతంలో భద్రతా దళాలు ఒక సౌదీ పౌరుడిని అరెస్టు చేశాయి. అతను మూడు వాహనాలను ఢీకొట్టి, వాటిలో ఒకదానిలో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, నిందితుడు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని దర్యాప్తులో తేలిందని పబ్లిక్ సెక్యూరిటీ తెలిపింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







