మయన్మార్ భూకంపం.. తమ జాతీయులు భద్రతపై ఒమన్ ప్రకటన..!!
- March 29, 2025
మస్కట్: మయన్మార్ లో భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో బ్యాంకాక్‌లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌తో సహా వివిధ ప్రాంతాలలో భూకంపం ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. కాగా, భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రాయబార కార్యాలయం ధృవీకరించింది. థాయిలాండ్‌లోని ఒమన్ పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, స్థానిక థాయ్ అధికారులు జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది.
అత్యవసర పరిస్థితుల కోసం, రాయబార కార్యాలయం 24/7 అందుబాటులో ఉన్న ప్రత్యేక హాట్‌లైన్ నంబర్ +66638871775ను సంప్రదించాలని సూచించింది. అవసరమైన వారికి ఏ విధంగానైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఒమన్ జాతీయులకు హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్‌పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు







