అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- March 13, 2026
అమరావతి: అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్.చెన్నవీర్, బీఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్ లో ఉంటాయని తెలిపారు. “రెండు దశల్లో 7వేలమంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణాలను చేపడుతున్నాం, ఈ క్యాంపస్ పై వచ్చే ఐదేళ్లలో వెయ్యికోట్ల పెట్టుబడి పెడతాం” అని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు అనుగుణంగా నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నాం. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను పాటిస్తున్నాం. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ గా ఉండబోతోంది.అధునాతన సాంకేతికలతో పాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు కూడా ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బిట్స్ ప్రతినిధులు తెలిపారు.బిట్స్ నిర్మాణ ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సంతృప్తి వ్యక్తంచేశారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







