అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- March 13, 2026
న్యూఢిల్లీ: భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి మరియు ‘అటల్ స్మృతి న్యాస్ సొసైటీ’ అధ్యక్షులు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఢిల్లీలోని 1, త్యాగరాజ్ మార్గ్ లో ఉన్న తమ అధికారిక నివాసంలో...అటల్ స్మృతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురు ప్రముఖులతో వరుస చర్చలు జరుపుతున్నారు. బుధవారం నాడు పలువురు రాజకీయ, అటల్ జీ తో పని చేసిన ప్రముఖులతో సమావేశమైన ఆయన...ఈరోజు అనగా గురువారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖాగుప్త, మాజీ కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, పూర్వ ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా, హర్యానా పూర్వ మంత్రి ఓం ప్రకాష్ ధన్ కర్ తో సమావేశమయ్యారు.
భారతదేశ గౌరవ పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం, వారు పాటించిన విలువలు మరియు దేశానికి వారు అందించిన అసమానమైన సేవలను గౌరవించుకోవడంతో పాటు, వారి వారసత్వాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ భేటీలు సాగుతున్నాయి. అటల్ జీ ఆశయాలకు అనుగుణంగా అటల్ స్మతిన్యాస్ సొసైటీ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించడమే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. స్మృతిన్యాస్ సొసైటీ చేపట్టబోయే కార్యక్రమాలకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రముఖులు తెలియజేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







