అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- March 13, 2026
పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో అమెరికాకు చెందిన KC-135 స్ట్రాటో ట్యాంకర్ కూలిన ఘటనపై యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టతనిచ్చింది.ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో నలుగురు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన ఇద్దరు సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.సైనిక నిబంధనల ప్రకారం, మరణించిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన 24 గంటల తర్వాతే వారి పేర్లను బహిరంగపరుస్తామని అధికారులు తెలిపారు.
సాధారణ రీఫ్యుయలింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. KC-135 విమానం మరో యుద్ధ విమానానికి ఇంధనాన్ని నింపుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. అయితే, ఇంధనాన్ని తీసుకుంటున్న మరో విమానం ఎటువంటి నష్టం లేకుండా సురక్షితంగా సమీపంలోని బేస్ లో ల్యాండ్ అయింది. ఈ విమానం కూలడం వెనుక ఎలాంటి శత్రు దేశాల దాడులు లేదా ‘ఫ్రెండ్లీ ఫైర్’ (సొంత దళాల పొరపాటు కాల్పులు) లేవని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఇది సాంకేతిక లోపం లేదా వాతావరణ పరిస్థితుల వల్ల జరిగిన ప్రమాదం గానే భావిస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం మరియు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు బృందం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







