రక్షణ సహకారంపై సౌదీ, అమెరికా మధ్య చర్చలు..!!

- April 05, 2025 , by Maagulf
రక్షణ సహకారంపై సౌదీ, అమెరికా మధ్య చర్చలు..!!

రియాద్: సౌదీ అరేబియా, అమెరికా మధ్య సైనిక, రక్షణ సహకారం పెరగనుంది. ఈ మేరకు చర్చించడానికి జనరల్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాద్ అల్-రువైలి రియాద్‌లో యుఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు మిత్రదేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సమన్వయంలో భాగంగా ఈ సమావేశం జరిగింది.

సౌదీ అరేబియాకు ప్రెసిషన్-గైడెడ్ ఆయుధ వ్యవస్థలను విక్రయించడానికి సంబంధించి ఆయుధ ఒప్పందాన్ని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇటీవల ఆమోదించింది. గత నెలలో సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ వాషింగ్టన్ డి.సి.ని సందర్శించారు. అక్కడ ఆయన ద్వైపాక్షిక చర్చల కోసం యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌తో సమావేశమయ్యారు.

అమెరికా-సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. రక్షణ రంగంలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త అవకాశాలపై ఫోకస్ చేశారు. శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలపై ఇరువురు సమీక్షలు నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com