షార్జాలోని 9 మందిని రక్షించిన సిబ్బందిని సత్కరించిన ఉప ప్రధాన మంత్రి..!!
- April 08, 2025
యూఏఈ: సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఆసియన్ల ప్రాణాలను కాపాడిన సెర్చ్-అండ్-రెస్క్యూ ఆపరేషన్ కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సభ్యులను యూఏఈ ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సత్కరించారు. పైలట్లు, నావిగేటర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సహా వైమానిక దళ సభ్యులకు షేక్ సైఫ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ పతకాలను అందజేశారు.
షార్జాలోని హమ్రియా ఓడరేవు సమీపంలో వారి ఓడ బోల్తా పడిన తర్వాత, రెండు గంటల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో తొమ్మిది మందిని ఎటువంటి గాయాలు లేకుండా రక్షించారు.అధికారుల నుండి సంఘటన గురించి నివేదికలు అందిన తర్వాత, మంత్రిత్వ శాఖ ఎయిర్ వింగ్ మెడికల్, వైమానిక సిబ్బంది వేగంగా స్పందించి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వారిని రక్షించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







